Viswanathapalli : కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాధపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కృష్ణా జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు, మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనగళ్ళ నారాయణరావు, పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్భంగా కొనగళ్ళ నారాయణరావు మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం యొక్క పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు సమీపంగా తీసుకెళ్లేందుకు టీడీపీ కృషి చేస్తోంది.
Viswanathapalli : కొనగళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో విశ్వనాధపల్లిలో “సుపరిపాలనలో తొలి అడుగు”
RELATED ARTICLES

