Saturday, December 6, 2025
Google search engine
Homeలేటెస్ట్ న్యూస్Trimula : భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 19న విడుదల

Trimula : భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 19న విడుదల

Trimula : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అక్టోబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోసం లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్‌ 21న ఉదయం 10 గంటల వరకు, టికెట్ల విడుదల 22న ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవలు, దర్శన స్లాట్ల కోటా అందుబాటులో ఉంటుంది.

23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదలవుతుంది. 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటా అందుబాటులో ఉంటుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే బుకింగ్‌ చేయాలని తితిదే సూచించింది.

RELATED ARTICLES

Most Popular