Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. లడ్డూ ప్రసాదం పొందడంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు టీటీడీ వినూత్నమైన కియోస్క్ మెషీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా భక్తులు గంటల తరబడి క్యూలలో నిలబడకుండానే సులభంగా లడ్డూలు పొందవచ్చు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ కియోస్క్ మెషీన్లను లడ్డూ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మకంగా తిరుమలలో 5 కియోస్క్ మెషీన్లను అమర్చిన టీటీడీ, ఈ విధానాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మెషీన్ల ద్వారా భక్తులు తమ దర్శన టికెట్ టోకన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం, స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌నిపిస్తుంది, దాన్ని స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి UPI ద్వారా చెల్లింపు చేయాలి. చెల్లింపు పూర్తయిన తర్వాత ఒక రసీదు వస్తుంది, దాన్ని లడ్డూ కౌంటర్‌లో చూపించడం ద్వారా భక్తులు లడ్డూలు పొందవచ్చు.
ఈ విధానం దర్శన టికెట్ లేని భక్తులకు కూడా వర్తిస్తుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా వారు రెండు లడ్డూలు పొందే అవకాశం ఉంది. ఈ కొత్త సిస్టమ్‌తో లడ్డూ పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది, భక్తుల సమయం ఆదా అవుతుంది. గతంలో లడ్డూల కోసం భక్తులు నేరుగా కౌంటర్‌లో ఆధార్ కార్డ్ లేదా దర్శన టికెట్ చూపించి, క్యూలలో నిలబడి లడ్డూలు తీసుకునేవారు. అయితే, ఈ కొత్త డిజిటల్ కియోస్క్ విధానం ద్వారా క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ.. టీటీడీ రద్దీని నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. ఈ కొత్త విధానం భక్తుల సౌకర్యాన్ని మరింత పెంచడమే కాకుండా, తిరుమలలో డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముందడుగుగా నిలుస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని కియోస్క్ మెషీన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

