Thalapathi 69 Movie : తమిళ సినిమా స్టార్ హీరో తలపతి విజయ్ తన 69వ సినిమా ‘జన నాయకుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది విజయ్ సినీ కెరీర్‌లో చివరి సినిమాగా రాబోతుంది. ఆ తర్వాత విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకుడు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జన నాయకుడు’ ఫస్ట్ రోర్‌ను మేకర్స్ రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. ఈ ఫస్ట్ రోర్ అభిమానుల అంచనాలను అందుకోవడమే కాకుండా, అభిమానులను ఉర్రూతలూగించింది. వింటేజ్ లుక్‌లో పోలీస్ యూనిఫామ్‌లో విజయ్ అద్భుతంగా కనిపించాడు. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ రోర్‌కు మరింత శక్తిని జోడించింది. అలాగే, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూరన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ‘జన నాయకుడు’ సినిమా విజయ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

