sreeleela : టాలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్‌గా గుర్తింపు పొందిన హీరోయిన్ శ్రీలీల.. ఇటీవల బాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. శ్రీలీల 2019లో కన్నడ సినిమా “కిస్”తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2021లో “పెళ్లి సందడి” సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమె నటన మరియు డాన్స్‌లు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఆ తర్వాత “ధమాకా” (2022) సినిమాలో రవితేజ సరసన నటించి భారీ విజయాన్ని అందుకుంది. “భగవంత్ కేసరి” (2023) మరియు “పుష్ప 2: ది రూల్” (2024)లో ఐటెం సాంగ్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అతి తక్కువ సమయంలోనే శ్రీలీల టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మొత్తం ఐదు భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది.
ఈ క్రమంలో ఆమె తనను స్టార్‌డమ్‌కు చేర్చిన తెలుగు చిత్ర పరిశ్రమను పక్కనపెట్టి, ఇతర ఇండస్ట్రీలపై దృష్టి సారిస్తూ తెలుగు నిర్మాతలను ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు కొన్ని మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. శ్రీలీల తెలుగు సినిమాలను, నిర్మాతలను కాస్త నిర్లక్ష్యం చేస్తోందనే గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తెలుగు సినిమాలు కంటే ఆమె బాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రీలీల కార్తిక్ ఆర్యన్‌తో ‘ఆషికి-3’తో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఈ సినిమా దీపావళి 2025లో విడుదల కానుంది. అంతేకాక, సిద్ధార్థ్ మల్హోత్రాతో మరో హిందీ ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ఈ బిజీ షెడ్యూల్ వల్ల తెలుగు నిర్మాతలతో సమన్వయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని టాక్.తమిళంలో శివకార్తికేయన్‌తో ‘పరాశక్తి’ సినిమా చేస్తూ కోలీవుడ్‌లోనూ సందడి చేస్తోంది శ్రీలీల. ఈ మల్టీ-ఇండస్ట్రీ ఫోకస్ వల్ల టాలీవుడ్‌లో ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయడంలో ఆలస్యం జరుగుతోందని కొందరు నిర్మాతలు ఫీలవుతున్నారట.శ్రీలీల వరుస ఫ్లాప్‌ల తర్వాత కూడా టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, ఇప్పుడు ఆమె ఇతర ఇండస్ట్రీలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో కాస్త అసంతృప్తిగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి రావడం, షెడ్యూల్స్‌లో జాప్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని సినీ ఇండస్ట్రిలో టాక్ నడుస్తుంది.

