Sunday, December 7, 2025
Google search engine
HomeతెలంగాణRaithu Bharosa : రైతు భరోసా డబ్బులు రిలీజ్.. మీ బ్యాంక్ అకౌంట్లు చెక్...

Raithu Bharosa : రైతు భరోసా డబ్బులు రిలీజ్.. మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి

తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, వర్షాకాల పంటలకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. ఈ పథకం కింద 70,11,984 మంది రైతులకు సుమారు 9 వేల కోట్ల రూపాయలు బదిలీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. జూన్ 16 నుంచి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడం ప్రారంభమైంది. తొలి విడతగా, రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున నిధులు జమ చేయబడ్డాయి. ఈసారి, 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు కూడా ఈ పథకం ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని సమాచారం. గతంలో 3.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితమైన ఈ పథకం, ఇప్పుడు మరింత విస్తరించబడింది.

RELATED ARTICLES

Most Popular