Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆహార భద్రత కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రంలో 89.95 లక్షల రేషన్ కార్డులు ఉండగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి కొత్త కార్డుల జారీ ప్రకటన చేశారు. ఆ తరువాత జనవరి 26 నుంచి మే 23 వరకు 2.03 లక్షల కొత్త కార్డులు, మే 24 నుంచి ఇప్పటి వరకు మరో 3.58 లక్షల కార్డులు ఆన్‌లైన్‌లో జారీ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 5,61,343 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95,56,625కు చేరిందని పౌరసరఫరాల శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని పది జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను ఎక్కువగా పంపిణీ చేయనున్నారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 50,102 కార్డులు, కరీంనగర్ జిల్లాలో 31,772 కార్డులు పంపిణీ కానున్నాయి. కొత్త కార్డుల జారీ తరువాత హైదరాబాద్ జిల్లా 6,67,778 రేషన్ కార్డులతో అగ్రస్థానంలో నిలవనుంది. కొత్త రేషన్ కార్డుల జారీతో పేదలకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని స్పష్టమవుతోంది.
Ration Cards : కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్
RELATED ARTICLES

