Rasi Phalalu : మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడి, ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు చేకూరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, బాధ్యతలు మారే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఆఫర్లు రావచ్చు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. శుభవార్తలు అందుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం, ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. ఆస్తి వివాదాల్లో బంధువులతో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. రుణ వసూళ్లు సాధ్యమవుతాయి. కొందరు మిత్రుల వల్ల స్వల్ప నష్టం రావచ్చు. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం ఇబ్బంది కలిగించవచ్చు. ధనపరంగా హామీలు ఇవ్వకపోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : కన్య రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రుణ సమస్యలు తగ్గుతాయి. రావలసిన డబ్బు వసూలు కాగలదు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : తుల రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, హోదా పెరుగుతాయి. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా ఫలితం ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సహకారంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వస్త్రాభరణాల కొనుగోలు ఉంటుంది. పిల్లల చదువుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : వృశ్చిక రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగవుతుంది. అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు, అధికారుల ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం, రావలసిన సొమ్ము వసూలవుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుస్తుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : మకర రాశి వారు పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలగవచ్చు. స్వల్ప అనారోగ్యం ఉండవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : మీన రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, ఖర్చులు పెరుగుతాయి. గృహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.

