Movie Tickets : కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లతో సహా అన్ని థియేటర్లలో, అన్ని భాషల చిత్రాలకు ఈ రేటు వర్తిస్తుంది. బెంగళూరులో వీకెండ్‌లలో టికెట్ ధరలు రూ.1000-1500 వరకు ఉండటంతో వ్యతిరేకత రాగా, ఈ నిర్ణయంతో సామాన్యుల నుంచి ప్రభుత్వంపై ప్రశంసలు కురిశాయి. స్నాక్స్ ధరలను కూడా తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. 15 రోజుల్లో అభ్యంతరాలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం, స్పెషల్ షోలు, ప్రీమియర్‌లతో అదనపు రేట్లు విధించడం చర్చనీయాంశంగా ఉంది. తమిళనాడు, కర్ణాటకలు ధరలను తగ్గిస్తుండగా, ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టికెట్ ధరలను తగ్గించారు, దీనిని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండాలని, లేకుంటే థియేటర్లకు జనం దూరమవుతారని థియేటర్ యజమానులు, సామాన్యులు అంటున్నారు. అయితే, నిర్మాతలు భారీ ఖర్చుల కారణంగా తొలి వారంలోనే లాభాలు ఆశిస్తారు.

