Mopidevi : కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని తమిళనాడుకు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు డైరెక్టర్ కృష్ణమూర్తి తన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు మరియు అర్చక బృందం వారికి ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం, కృష్ణమూర్తి ఆలయ ప్రాగణంలోని పుట్టలో పాలు పోసి, స్వామివారికి మెక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ వారిని ఘనంగా సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అంతేకాక, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి, వారి ఆలయ సందర్శనను స్మరణీయం చేశారు.

