MLA Mandali Buddhaprasad : తెలుగు భాష మరింత వికసించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని బుక్ ఫెస్టివల్ సొసైటీ హాలులో కృష్ణాజిల్లా రచయితల సంఘం సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, చరిత్ర పరిశోధకురాలు, ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి రచించిన ‘జీవన సౌరభాలు’ పద్య కవితా సంపుటి పుస్తకం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు, గ్రంథ స్వీకర్త వెస్ట్ ఫార్గో లీడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బత్తినపాటి షణ్ముఖన్ పాల్గొన్నారు.

