Axis Bank scam : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కుబేర సినిమా స్టైల్‌లో జరిగిన భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్‌ను కేంద్రంగా చేసుకుని మోసగాళ్లు సుమారు రూ.10.6 కోట్ల రుణాలను దోచుకున్నారు. నిరుపేద గిరిజనులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపించి, వారి ఆధార్ కార్డులు, సంతకాలు, వేలిముద్రలను అనుమతి లేకుండా సేకరించి, ఫేక్ కంపెనీల పేరుతో రుణాలు తీసుకున్నారు. ఈ స్కామ్‌లో 56 మంది బాధితులను గుర్తించినట్లు ముత్తుకూరు పోలీసులు తెలిపారు.
2022 ఫిబ్రవరి 10 నుంచి 2024 జనవరి 8 వరకు దాదాపు రెండేళ్ల పాటు ఈ మోసం కొనసాగింది. జలే వాసుదేవ నాయుడు, అల్లా బక్షు, శివ, వెంకట్ (వెంకీ), సుధాకర్‌లతో కూడిన నిందితుల బృందం, AVNET ఇండియా, MR ఇన్ఫో లైన్, గ్లోబల్ సొల్యూషన్, క్యాపిటల్ ట్రీ వంటి నకిలీ కంపెనీలను సృష్టించి, 56 మంది గిరిజనులను ఈ కంపెనీల్లో ఉద్యోగులుగా చూపించారు. నకిలీ జీతం స్టేట్‌మెంట్లు, ఉద్యోగ ధృవీకరణ ఫారమ్‌లను సమర్పించి, నెల్లూరు జిల్లాలోని యాక్సిస్ బ్యాంక్ శాఖల నుంచి వ్యక్తిగత, వ్యాపార రుణాలు మరియు క్రెడిట్ కార్డులను పొందారు. ఈ మోసానికి సంబంధించి యానాది వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సి. పెంచలయ్య ఆరోపణలు చేస్తూ, నిందితులు మార్ఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి గిరిజనులను సాఫ్ట్‌వేర్ నిపుణులుగా చిత్రీకరించారని తెలిపారు.
ఈ మోసం గురించి బాధితులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో, బ్యాంకు నుంచి రుణ వసూళ్ల కోసం నోటీసులు అందినప్పుడు వారు షాక్‌కు గురయ్యారు. తమ పేరిట రుణాలు తీసుకున్న విషయం తెలియక, ఇప్పుడు బ్యాంక్ నోZenith Bank, Nigeria టీసులతో గిరిజనులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ స్కామ్‌పై యానాది సంఘం నాయకులు తీవ్ర ఆగ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, డిసెంబర్ 2024లో ఫిర్యాదు నమోదైనప్పటికీ, నిందితులపై గట్టి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
2024 డిసెంబర్‌లో యాక్సిస్ బ్యాంక్ ఆర్టీసీ బస్టాండ్ శాఖ మేనేజర్ మన్నేపల్లి మదన్ మోహన్, ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. సీఐ రవి నాయక్ నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తులో 56 మంది బాధితులను గుర్తించారు. నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ స్కామ్‌లో మరింత మంది ప్రమేయం ఉండొచ్చని, బ్యాంకు ఉద్యోగులను కూడా విచారిస్తామని ఆయన వెల్లడించారు.

