AP Mega DSC Final Key : ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీలు విడుదలయ్యాయి. విద్యాశాఖ అన్ని సబ్జెక్టుల ఫైనల్ కీలను https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, హోం పేజీలోని “Final KEY” ఆప్షన్‌పై క్లిక్ చేసి, సబ్జెక్టు వారీగా ఉన్న డాక్యుమెంట్ లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫైనల్ కీని పొందే ప్రక్రియ సులభం. వెబ్‌సైట్‌లోని “Final KEY” ఆప్షన్‌పై నొక్కగానే, సబ్జెక్టుల జాబితా కనిపిస్తుంది. అభ్యర్థి తమ సబ్జెక్టు పక్కన ఉన్న డాక్యుమెంట్ లింక్‌పై క్లిక్ చేస్తే, ఫైనల్ కీతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ కీ ఆధారంగా అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
ఏపీ మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ డీఎస్సీకి 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. చాలా మంది అభ్యర్థులు తమ అర్హతలకు తగ్గట్టుగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

