Anasuya : ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతుండగా… కొందరు యువకులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో అనసూయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెప్పు తెగుద్ది’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. మార్కాపురంలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో అనసూయ ఉపన్యాసం ఇస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన అనసూయ.. వారిని ఉద్దేశించి, “చెప్పు తెగుద్ది! మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య వంటి కుటుంబ సభ్యులపై ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకుంటారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పలేదా? వెరీ బ్యాడ్!” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

