Saturday, December 6, 2025
Google search engine
Homeలేటెస్ట్ న్యూస్YS Jagan : సీఎం చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు

YS Jagan : సీఎం చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, ముఖ్యంగా మహిళా నాయకులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, చంద్రబాబు పాలనను “శాడిజం, పైశాచికత్వం”గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

జగన్ తన వ్యాఖ్యల్లో, కృష్ణా జిల్లా గుడివాడలో జడ్పీ ఛైర్‌పర్సన్, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి పోలీసుల సమక్షంలో, దుర్భాషలతో జరిగిందని, ఇది చంద్రబాబు ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపించారు. “ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, పచ్చ సైకోలతో దాడులు చేయించడం గొప్ప పనా?” అని జగన్ ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలకు నాయకులు, మహిళా నాయకులు హాజరు కాకూడదా అని నిలదీశారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్య:“అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆయనను తన సొంత నియోజకవర్గ కేంద్రానికి వెళ్లనీయకుండా చేస్తున్నారు. పోలీసులు సినిమా స్టైల్‌లో తుపాకులు చూపిస్తూ ఆయన్ని బయటకు తీసుకెళ్లారు. ఇదే విధంగా నెల్లూరులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఈ దాడి పథకం ప్రకారం జరిగిందని, దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, బాధితుడిపైనే కేసులు పెట్టారని” జగన్ ఆరోపించారు.

జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయ కక్షలతో వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సహా వందలాది మంది గ్రామ, మండల స్థాయి నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై దొంగ కేసులు పెట్టి హింసిస్తున్నారని విమర్శించారు. “మీరు రాజకీయ కక్షలతో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండవు. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఈ దుర్మార్గాలకు, అన్యాయాలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. అలాగే, చంద్రబాబు తమ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని జగన్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular