Saturday, December 6, 2025
Google search engine
Homeలేటెస్ట్ న్యూస్Rain Alert : రెయిన్ అలెర్ట్.. తెలంగాణలో నేడు భారీ వర్షాలు

Rain Alert : రెయిన్ అలెర్ట్.. తెలంగాణలో నేడు భారీ వర్షాలు

Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో నేడు (బుధవారం) మరియు రేపు (గురువారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రత్యేకించి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేయడమైనది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాలు ఉత్తర దిశగా కదులుతున్నందున, రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular