Sunday, December 7, 2025
Google search engine
Homeఆంధ్రప్రదేశ్Vikkurthi Venkata Srinivasa Rao : మంత్రి కొల్లు రవీంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విక్కుర్తి

Vikkurthi Venkata Srinivasa Rao : మంత్రి కొల్లు రవీంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విక్కుర్తి

Vikkurthi Venkata Srinivasa Rao : గనులు, భూగర్భ శాస్త్ర, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్రకు ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కొల్లు రవీంద్ర జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం మచిలీపట్నంలోని కొల్లు రవీంద్ర స్వగృహంలో కలిసిన విక్కుర్తి శ్రీనివాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, పూల బొకేలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్రతో శ్రీనివాస్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి మచిలీపట్నం నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత రవీంద్ర కే దక్కుతుందన్నారు. తాను నిర్వహిస్తున్న శాఖలకు వన్నె తెచ్చే విధంగా మంత్రి రవీంద్ర పాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా రవీంద్ర సేవలను శ్రీనివాస్ కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular